Site icon HashtagU Telugu

IPL and Dhoni: ధోనీ అనుకుంటే చెన్నైకి ఎన్నాళ్ల యినా ఆడతాడు

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటినుండి అతను ఎప్పుడు.. ఐపీఎల్ కు వీడ్కోలు పులుకుతాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ధోనికీ ఐపీఎల్ 2021 చివరి సీజన్ అనుకుంటే…15వ సీజన్ లోనూ ఆడుతున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో దాంతో మళ్ళీ ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో ధోనీ రిటైర్ మెంట్ పై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మహి మళ్ళీ ఆటగాడిగా కనిపిస్తాడా లేక మరో రోల్ లోనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ధోనీ ఐపీఎల్ రిటైర్ మెంట్ పై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ అనుకుంటే చెన్నైకి ఎన్నాళ్ల అయినా ఆడతాడని చెప్పాడు. చెన్నై టీమ్ తో అతనికి ఉన్న అనుబంధం అలాంటిదని వ్యాఖ్యానించాడు. ఈ సీజన్ లో కొన్ని తప్పిదాల కారణంగా చెన్నై ప్లే ఆఫ్ చేరలేక పోయిందని , అయితే ధోనీ వచ్చే ఏడాది మళ్ళీ తన కెప్టెన్సీతోనే జవాబు చెప్తాడని హేడెన్ అభిప్రాయ పడ్డాడు.40 ఏళ్ల వయసులోనూ వికెట్ల మధ్య ధోనీ అద్భుతంగా పరిగెడుతున్న విషయాన్ని హేడెన్ గుర్తు చేశాడు.

వికెట్ల వెనుక కీపింగ్ లోనూ అతని వేగం తగ్గలేదని , కెప్టెన్సీ విషయంలో ఎప్పటిలానే జట్టును లీడ్ చేస్తున్నాడని ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ విశ్లేషించాడు. చెన్నై టీమ్ యాజమాన్యం ధోనీని అంత సులభంగా వదులుకునే ప్రసక్తే లేదన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసన్న హేడెన్ తన వారసుడు ఎవరనే దానిపై స్పష్టత వచ్చిన తర్వాత ధోనీ చెన్నై జట్టులో మరొక పాత్రలో కనిపిస్తాడని అంచనా వేశాడు.ధోనిని కూడా ఈ మధ్యే ఇదే ప్రశ్న అడగగా అతను విచిత్రంగా స్పందించాడు. నేను వచ్చే ఏడాది కూడా చెన్నై జట్టుతోనే ఉంటా..కానీ అది ఈ జెర్సీలోనా.. లేక వేరే జెర్సీలోనా అనేది మీకు అప్పుడే తెలుస్తుంది అన్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా ధోనీని కెప్టెన్ గా మైదానంలోనే చూడలేని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version