Site icon HashtagU Telugu

MS Dhoni Retirement: నా రిటైర్మెంట్‌ను నిర్ణయించేది నేను కాదు.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ధోనీ

MS Dhoni

MS Dhoni Retirement

MS Dhoni Retirement: ఐపీఎల్ 2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు వ‌రుస ఓటముల‌ను చ‌విచూస్తోంది. మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడ‌గా.. మూడింటిలో ఓట‌మి పాలైంది. దీనికితోడు ఆ జ‌ట్టుకు పెద్ద‌బ‌లంగా ఉన్న మ‌హేంద్ర సింగ్ ధోనీసైతం ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సూచ‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శ‌నివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ కోసం ధోనీ తల్లిదండ్రులు చెపాక్ స్టేడియంకు వచ్చారు. ఈ నేపథ్యంలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ధోనీ రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా.. ధోనీ మాట్లాడుతూ త‌న రిటైర్మెంట్ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: KL Rahul: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని అధిగ‌మించిన కేఎల్ రాహుల్‌!

మీడియా ముందుకు వచ్చిన  మ‌హేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ మొత్తం పూర్తయ్యే వరకు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. * నేను ఐపీఎల్ ఆడాలా, వద్దా అని నిర్ణయించేది నేను కాదు, నా శరీరం. నాకు ఇప్పుడు 43 ఏళ్లు. జులై నెలలో 44వ సంవత్సరంలోకి అడుగు పెడతా. ఈ ఐపీఎల్ పూర్తిగా ఆడతా. వచ్చే ఐపీఎల్ గురించి నిర్ణయించుకునేందుకు నాకు 10 నెలల సమయం ఉంది. ఆ సీజన్ ప్రారంభానికి ముందు నా శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా. ఇక చాలు అనిపించే వరకు ఆడుతూనే ఉంటా. ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించను* అని ధోనీ స్పష్టం చేశారు.

Also Read: PBKS vs RR: మైదానంలో లైవ్ మ్యాచ్ జరుగుతోంది.. హాయిగా నిద్ర‌పోయిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైర‌ల్

ఇదిలాఉంటే.. ఈ సీజన్ లో ఎంఎస్ ధోని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 138.18 స్ట్రైక్ రేట్ తో మొత్తం 76 పరుగులు చేశాడు. అత్యత్తమ స్కోరు 30 పరుగులు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల‌లో ఓడిపోయిన చెన్నై త‌దుప‌రి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 8న చంఢీగ‌డ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.