Site icon HashtagU Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఏ విషయంలో అంటే?

MS Dhoni

MS Dhoni

MS Dhoni: ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి తన అసాధారణ ప్రతిభతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేవలం 11 బంతుల్లో 26* పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వయస్సులో ఈ అవార్డు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు గతంలో ప్రవీణ్ తాంబే (42 సంవత్సరాల 208 రోజులు) పేరిట ఉండేది. ధోనీ ఈ ప్రదర్శనతో తన అభిమానులకు మరోసారి ‘తలా’ అనే పిలుపుకు తగ్గట్టుగా నిరూపించుకున్నాడు.

ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అనేక రికార్డులు సృష్టించిన లెజెండరీ క్రికెటర్. ఇటీవలి ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో అతను 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని, అత్యధిక వయస్సులో ఈ అవార్డు సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Also Read: Tenth Class Results: తెలుగు రాష్ట్రాల్లో పది ఫలితాలు ఎప్పుడంటే?

ధోనీ పేరిట ఉన్న ఇతర ముఖ్యమైన ఐపీఎల్ రికార్డులు ఇవీ!