Site icon HashtagU Telugu

Dhoni Bowling: ఆర్సీబీతో మ్యాచ్ లో ధోనీ బౌలింగ్..

Dhoni Bowling

Dhoni Bowling

Dhoni Bowling: ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలు ముగుస్తున్న తరుణంలో రేపు శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోనీ కొత్త బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి 18న బెంగళూరు, చెన్నై మధ్య జరిగే మ్యాచ్‌ కోహ్లీకి చాలా స్పెషల్ మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఈ డేట్ కోహ్లీకి చాలా ఇష్టం. ఈ తేదీన ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా, రెండింటిలో ఆర్సబి విజయం సాధించింది. ఈ తేదీన గతంలో జరిగిన మ్యాచ్ ల్లో కోహ్లీ విధ్వంస సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు సిద్ధమైంది. ఈ కీలక పోరు కోసం నెట్స్‌లోని చెన్నై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ధోని బౌలింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

సాధారణంగా ధోనీ బౌలింగ్‌ చేయడం అరుదు. అది కూడా కీలక మ్యాచ్ కి ముందు ధోనీ బౌలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మ్యాచ్ లో ధోనీ బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ధోనీ బౌలింగ్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆ సమయం కోసం చెన్నై ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ధోనీ బౌలింగ్ చేసినా, చేయకున్నా.. మే 18 కోహ్లి డే కాబట్టి చెన్నై కోహ్లీకి బ్రేక్ వేయాల్సిందే. ఈ రోజున కోహ్లి ఐపిఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను రెండు సెంచరీలు మరియు ఒక అర్ధ సెంచరీని సాధించాడు. కోహ్లి నిష్క్రమిస్తే చెన్నై గెలుపు ఖాయమని, ఇదే జరిగితే చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఈజీ అవుతుందని అంటున్నారు.

Also Read: PM Modi : ఈడీ సీజ్‌ చేసిన సోమ్ముపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు