ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్‌కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!

సర్ఫరాజ్ ఖాన్ గత వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో ఈసారి భారీ ధర పలుకుతుందని ఆశించాడు.

Published By: HashtagU Telugu Desk
IPL Mini Auction

IPL Mini Auction

IPL Mini Auction: అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసినప్పటికీ మరికొందరు మ్యాచ్ విన్నర్లు మాత్రం ఊహించని విధంగా తక్కువ ధరకే అమ్ముడయ్యారు. కేవలం బేస్ ప్రైస్‌కే అమ్ముడైన ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

తక్కువ ధరకే అమ్ముడైన టాప్-5 మ్యాచ్ విన్నర్లు

క్వింటన్ డి కాక్ దక్షిణాఫ్రికాకు చెందిన ఈ విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ అపారమైన అనుభవం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఈసారి వేలంలో కేవలం ముంబై మాత్రమే ఇతనిపై ఆసక్తి చూపింది. దీంతో 1 కోటి రూపాయల బేస్ ప్రైస్‌కే ముంబై జట్టు ఇతడిని సొంతం చేసుకుంది.

Also Read: ‎కాకరకాయ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

సర్ఫరాజ్ ఖాన్ గత వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో ఈసారి భారీ ధర పలుకుతుందని ఆశించాడు. మొదటి రౌండ్‌లో నిరాశ ఎదురైనప్పటికీ రెండో రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇతడిని 75 లక్షల బేస్ ప్రైస్‌కే దక్కించుకుంది. నిజానికి ఇతని ప్రతిభకు ఇది చాలా తక్కువ ధర.

ఆకాశ్ దీప్ సాధారణంగా టీమ్ ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లకు వేలంలో భారీ డిమాండ్ ఉంటుంది. కానీ ఆకాశ్ దీప్ విషయంలో ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి చూపలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ చాకచక్యంగా వ్యవహరించి ఇతడిని 1 కోటి రూపాయల బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేసింది.

డేవిడ్ మిల్లర్ ‘కిల్లర్ మిల్లర్’గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అసలైన మ్యాచ్ విన్నర్. ఐపీఎల్‌లో 141 మ్యాచ్‌ల్లో 3077 పరుగులు చేసిన అనుభవం ఇతనికి ఉంది. మిగతా ఫ్రాంచైజీలు ఇతర స్టార్ల వెంట పడుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇతడిని కేవలం 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌కే దక్కించుకుంది.

బెన్ డకెట్ ఇంగ్లాండ్‌కు చెందిన డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసింది. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన డకెట్, ఏ జట్టుకైనా ప్రమాదకరమైన ఆటగాడు. ఇప్పటివరకు ఆడిన 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇతను 527 పరుగులు సాధించాడు.

  Last Updated: 18 Dec 2025, 10:37 AM IST