Virat Kohli: జంగ్‌కుక్‌ను అధిగమించిన కోహ్లీ

కోహ్లీకి సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు.టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చామని కాదని కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు.

Virat Kohli: కోహ్లీకి సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు.టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చామని కాదని కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు. సోషల్ మీడియాలో కింగ్ కున్న ఫ్యాన్స్ బేస్ అందరికి తెలిసిందే. కోహ్లీ గురించి నెటిజన్స్ నిత్యం ఎదో ఒకటి తెలుసుకోవాలని గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.

గత పాతికేళ్ల చరిత్రలో అత్యధిక మంది శోధించిన క్రికెటర్‌గా కోహ్లీ ఇప్పటికే టాప్‌ ప్లేస్ లో ఉండగా తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 2023 సంవత్సరంలో ఆసియా వ్యాప్తంగా వికిపీడియాలో నెటిజన్లు అత్యధికంగా చూసిన పేజీలలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. దక్షిణ కొరియాకు చెందిన బీటీఎస్‌ జంగ్‌కుక్‌ను అధిగమించి కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

2023 సంవత్సరంలో కోహ్లీ ఎన్నో రికార్డుల్ని బద్దలు కొట్టాడు. 2023లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ 2048 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. గిల్‌ 2,154 పరుగులతో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ పరుగులతో ఏడు సెంచరీలు ఉండటం విశేషం. వన్డే వరల్డ్‌ కప్‌లో సచిన్‌ 49 సెంచరీల రికార్డును చెరిపేసి 50వ శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 53.25 సగటుతో 639 రన్స్‌ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకంతో శతకాల రారాజుగా పేరుగాంచాడు.

Also Read: KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో తెలిపిన కేటీఆర్‌