Site icon HashtagU Telugu

World Cup 2023: ప్రపంచ కప్ లో ఇప్పటికివరకు టాప్ లో ఉన్నది ఎవరు?

Semi Final

World Cup 2023 (36)

World Cup 2023: 2023 ప్రపంచకప్ లో  టీమిండియా టాప్ స్థానం దక్కించుకుంది. ఆడిన మూడు మ్యాచ్ లను గెలిచి నంబర్ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ కూడా హ్యాట్రిక్ విజయాలతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కేపీఆర్ మహ్మద్ రిజ్వాన్ 248 పరుగులతో టాప్ లో ఉన్నాడు. రెండోస్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే నిలిచాడు. ఈ మెగాటోర్నీలో కాన్వే ఇప్పటివరకు 229 పరుగులు చేశాడు. మూడోస్థానంలో టీమిండియా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, రిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. హిట్ మ్యాన్ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 217 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఉన్నాడు. డికాక్ 209 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకాన్ని నమోదు చేశాడు. ఐదో స్థానంలో శ్రీలంక బ్యాటర్ కుశల్ మెండిస్ కొనసాగుతున్నాడు. మెగాటోర్నీలో కుశల్ 207 రన్స్ చేశాడు.ఈ వరల్డ్ కప్ లో బౌలర్లు పదునైన బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ ప్రపంచ కప్ లో బుమ్రా టాప్ లో నిలిచాడు. బుమ్రా మూడు మ్యాచ్ ల్లో కలిపి 8 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, మరో న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 8 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ, శ్రీలంక పేస్ బౌలర్ మధుశంక ఏడేసి వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

Also Read: Mosquito : దోమలు ఎక్కువగా కొంతమందిని కుడుతుంటాయి ఎందుకో మీకు తెలుసా?