Site icon HashtagU Telugu

Virat Funny Video: కోహ్లీ కోతి చేష్టలు.. వైరల్ వీడియో

Virat Funny Video

Logo (12)

Virat Funny Video: టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు. సూపర్4 మ్యాచ్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ సెంచరీతో పాక్ బౌలర్ల బెండు తీశాడు. బ్యాట్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే విరాట్ కోహ్లీ కాస్త విశ్రాంతి దొరికితే తన చిలిపి పనులతో కడుపుబ్బ నవ్విస్తాడు.

ఈ రోజు బంగ్లాదేశ్ టీమిండియా మధ్య సూపర్4 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. వరుస మ్యాచ్ లతో అలసిపోయిన కోహ్లీ తో సహా మరికొందరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ ఖాళీగా కూర్చోకుండా వాటర్ బాయ్ గా అవతారమెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకువస్తూ.. కోతిలా గెంతుతూ నవ్వులు పోయించాడు.

ఆసియా కప్‌లోని సూపర్-4 చివరి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో రోహిత్ 5 మార్పులు చేశాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఈ మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ మొదటి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు.

Also Read: AP : చంద్రబాబు అరెస్ట్ ఫై జూ. ఎన్టీఆర్ స్పందించకపోవడం ఫై అచ్చెన్నాయుడు కామెంట్స్

Exit mobile version