Site icon HashtagU Telugu

Prediction On Virat Kohli: ఈరోజు జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేస్తాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Prediction On Virat Kohli

Prediction On Virat Kohli

Prediction On Virat Kohli: ICC T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు బార్బడోస్‌లో రాత్రి 8 గంటలకు జరుగుతుంది. తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా జట్టు విజ‌యాన్ని న‌మోదు చేసి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఆయన ఏం చెప్పారో చూద్దాం.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోస్యం

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్స్‌కు ముందు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఒక అంచనా వేశారు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీం ఇండియా ఐసీసీ ట్రోఫీ కరువును తొలగిస్తుందని, ఈసారి ఛాంపియన్‌గా నిలుస్తుందని మాజీ క్రికెట‌ర్ చెప్పాడు. దీంతో పాటు టోర్నీలో ఇప్పటివరకు పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (Prediction On Virat Kohli) గురించి కూడా చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ను తొలిసారిగా, చివరిసారిగా 2007లో టీమ్ ఇండియా గెలుచుకుంది.

Also Read: Sunita Williams: ఇంకొన్ని నెలలు ‘అంతరిక్షం’లోనే సునీత.. బోయింగ్ కంపెనీ ప్రకటన

ఈసారి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ICC T20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడు అని మాంటీ పనేసర్ జోస్యం చెప్పారు. నేడు జరిగే టీ20 WC ఫైనల్‌లో భారత జట్టు గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అంచనా వేశారు. అలాగే ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ రేపటి మ్యాచులో సెంచరీ చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైటిల్ బరిలో నుంచి తమ జట్టు తప్పుకోవడంతో టీమ్‌ఇండియాకు తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీలో విరాట్ ఇప్పటివరకు 75 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ మ్యాచ్ జూన్ 29న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరగనుంది.

We’re now on WhatsApp : Click to Join

విరాట్ బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు

ICC T20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చాలా పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్‌తో కలిపి ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 75 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ టోర్నీలో విరాట్ 40 పరుగుల ఫిగర్‌ను కూడా టచ్ చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విరాట్ ఫైనల్లో సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని మాంటీ పనేసర్ జోస్యం చెప్పటం స‌ర్వ‌త్యా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.