Site icon HashtagU Telugu

Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

Retirement

Retirement

Retirement: భారత జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ చివరిసారిగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతను డిసెంబర్ 3న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి తన రిటైర్‌మెంట్‌ (Retirement)ను ప్రకటించాడు. మోహిత్ శర్మ గత కొంతకాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ.. గత సీజన్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే తదుపరి సీజన్ ప్లేయర్ ఆక్షన్‌కు ముందు ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మోహిత్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

2014లో జరిగిన టీ20 ప్రపంచ కప్, 2015లో జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లో భాగమైన మోహిత్ శర్మ తన రిటైర్‌మెంట్ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. ఈ రోజు నేను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి నా రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తున్నాను. హర్యానా తరపున నా ఆట ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత నాకు టీమ్ ఇండియా జెర్సీ ధరించే అవకాశం లభించింది. ఆ తర్వాత నేను ఐపీఎల్‌లో కూడా ఆడాను. ఈ ప్రయాణం నాకు కల నిజమైనంత గొప్పది. నా ఈ ప్రయాణంలో హర్యానా క్రికెట్ అసోసియేషన్ నాకు చాలా మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా అనిరుధ్ సర్ నిరంతర మార్గదర్శకత్వం, నాపై ఉంచిన నమ్మకం నా ముందుకు సాగే మార్గాన్ని సులభతరం చేశాయి. దీనిని నేను మాటల్లో వర్ణించలేను రాసుకొచ్చాడు.

Also Read: Bharat Taxi: భారత్ ట్యాక్సీతో ఓలా, ఊబర్ కంటే చౌకగా రైడ్‌లు!

తన పోస్ట్‌లో మోహిత్ ఇంకా.. నా ప్రేమ, మద్దతు కోసం నేను బీసీసీఐ, నా కోచ్‌లు, నా సహచర ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సహాయక సిబ్బంది, నా స్నేహితులందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను నా భార్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎల్లప్పుడూ నా మూడ్ స్వింగ్స్‌ను, కోపాన్ని అర్థం చేసుకుని ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలిచింది అని పేర్కొన్నారు.

మోహిత్ శర్మ కెరీర్ వివరాలు

అంతర్జాతీయ క్రికెట్‌లో మోహిత్ శర్మకు టీమ్ ఇండియా తరఫున వన్డే, టీ20లలో ఆడే అవకాశం లభించింది. 26 వ‌న్డే మ్యాచ్‌ల్లో 32.9 సగటుతో మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 22 పరుగులకు 4 వికెట్లు. 8 టీ20 మ్యాచ్‌ల్లో 30.83 సగటుతో 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ వంటి నాలుగు జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఐపీఎల్‌లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడి, 26.22 సగటుతో మొత్తం 134 వికెట్లు సాధించాడు.

Exit mobile version