Site icon HashtagU Telugu

WI vs IND: బిగ్ షాక్.. వన్డే సిరీస్ నుంచి సిరాజ్ అవుట్

WI vs IND

New Web Story Copy (64)

WI vs IND: టీమిండియా వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ప్రత్యర్థి జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడి పైచేయి సాధించిన భారత్, వన్డేలోను సత్తా చాటాలనుకుంటుంది. రోహిత్ సారధ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఆడే అవకాశముంది. మిడిల్ అర్దర్లో కోహ్లీ, ఇషాన్ కిషన్ దిగనున్నారు. ప్రస్తుతం టీమిండియా అన్ని విధాలుగా బలంగా కనిపిస్తున్నది. ఈ సమయంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బీసీసీఐ బిగ్ షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. సిరాజ్ చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యుల సలహా మేరకె బీసీసీఐ సిరాజ్ కు విశ్రాంతి కల్పించింది

ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్ లో సిరాజ్ అదరగొట్టాడు. మొదటి టెస్టులో రెండు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్ రెండో టెస్టులో కరేబియన్లను మట్టికరిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు మ్యాచ్ తరువాత వన్డేలో సిరాజ్ సేవలను వినియోగించుకోవాలని రోహిత్ శర్మ భావించాడు. కానీ కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న మొదటి వన్డే మ్యాచ్ కు ముందు సిరాజ్ సిరీస్ నుంచి అవుట్ అయినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా సిరాజ్ విశ్రాంతి లేకుండా వరుస పర్యటనల్లో పాల్గొంటున్నాడు. మరోవైపు వరల్డ్ కప్ కి సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా సిరాజ్ కి రెస్ట్ ఇస్తే అప్పటిలోపు మరింత ఫిట్ గా ఉండొచ్చని బీసీసీఐ భావిస్తుంది . ఏదేమైనా వన్డేల సిరీస్ కు సిరాజ్ ఆడకపోవడం ఆ లోటు కొంతైనా కనిపిస్తుంది.

Also Read: KTR Review: వరద బాధితులకు అండగా ఉండండి, పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపు

Exit mobile version