Mohammed Siraj : రేపు హైదరాబాద్ లో మహ్మద్ సిరాజ్ రోడ్ షో

T20 ప్రపంచ కప్ విజేత మహ్మద్ సిరాజ్ రేపు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 11:03 PM IST

T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) విజేత మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) రేపు హైదరాబాద్లో రోడ్ షో (Hyderabad Road Show) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మెహిదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షోకు అభిమానులు తరలిరావాలని సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కోరారు.

2024 T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరును కనపరిచి..కప్ గెల్చుకున్న టీం ఇండియా కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉద‌యం ప్రధాని మోడీని కలిసిన భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు..అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ బ‌స్‌లో రోడ్ షో చేసి అభిమానులను అలరించారు. రోడ్ షో అనంత‌రం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ సన్మానించింది.

భారత క్రికెట్ జట్టు సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కును అందజేసింది. మ్యాచ్ గెలిచిన అనంతరం టీన్ఇండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే ఈరోజు వాంఖడే స్టేడియంలో సంబరాల అనంతరం చెక్కును అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రోహిత్ శర్మ, కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ ..నేను ఇద్దరం గత 15 సంవత్సరాలుగా భారత్ తరఫున ఆడుతున్నాం. ప్రపంచకప్ గెలవాలనేది మా కల. వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని అలా చూడటం అదే మొదటి సారి. రోహిత్, నేను ఇద్దరం ఏడ్చేశాం. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోను’ అని కోహ్లి చెప్పుకొచ్చారు.

ఇక ఆ సమయంలో రోహిత్ శర్మ నినాదాలతో వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక రోహిత్ మాట్లాడే సమయంలో ‘రోహిత్.. రోహిత్’ అంటూ అభిమానులు హోరెత్తించారు. ఈ సీన్ ‘బాహుబలి’ సినిమాను గుర్తు చేసిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రపంచకప్ గెలవడంతో కోట్లాది మంది భారతీయులు సంతృప్తి చెందారని రోహిత్ అన్నారు.

ఇక రిటైర్మెంట్ ఫై బుమ్రా క్లారిటీ ఇచ్చారు. తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని బుమ్రా తెలిపారు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సంగతి తెలిసిందే. 8 మ్యాచులాడి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో బుమ్రా తొలివరుసలో ఉన్నారు.

Read Also : Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్‌, విరాట్‌.. ఇదిగో వీడియో..!