IND vs SL: చ‌రిత్ర సృష్టించిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.

IND vs SL: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆతిథ్య జట్టు శ్రీలంక మొదటి ఓవర్లనే తడబడ్డది. జ‌స్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. ఓపెనర్ కుశాల్ పెరీరా(0)ను పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత పేస‌ర్ సిరాజ్ లంకేయులని వణికించేశాడు. ఇన్నింగ్స్ లో కీలక వికెట్ తీసుకున్నాడు. మరో ఓపెన‌ర్ పథుమ్ నిస్సంక‌(2)ను ఔట్ చేశాడు. దాంతో శ్రీలంక 8 ప‌రుగుల‌కే రెండో వికెట్ కోల్పోయింది. అదే కంటిన్యూ చేస్తూ.. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. నాలుగో ఓవ‌ర్ వేసిన సిరాజ్ మొద‌టి బంతికి పాథుమ్ నిశాంక (2; 4 బంతుల్లో) ను ఔట్ చేయ‌గా మూడో బంతికి సదీరా సమరవిక్రమ(0)ను ఎల్భీ డ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. నాలుగో బంతికి అస‌లంక (1) ఇషాన్ కిష‌న్ చేతికి చిక్కాడు. ఐదో బంతిని ఫోర్‌గా మ‌లిచిన ధ‌నుంజ‌య డిసిల్వా (4) ఆఖ‌రి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ లో సూప‌ర్ రిథ‌మ్‌లో ఉన్న సిరాజ్ ఐదో వికెట్ కూడా తీసుకున్నాడు. ఆరో ఓవ‌ర్‌లో సిరాజ్ అద్బుత బంతితో లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌(0)ను బౌల్డ్ చేశాడు. దాంతో, లంక 12 ప‌రుగుల‌కే ఆరో వికెట్ కోల్పోయింది. ఇక ఇదే ఊపులో మహ్మద్ సిరాజ్ ఆరో వికెట్ తీసుకున్నాడు. శ్రీలంక బ్యాటర్లలో కుదురుకున్న కుశాల్ మెండిస్‌ ను బౌల్డ్ చేశాడు. కుషాల్ 17 పరుగులు రాణించాడు. దీంతి సిరాజ్ ఆరో వికెట్ నేలకూల్చాడు.

Also Read: IND vs SL: మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన లంక