Site icon HashtagU Telugu

Mohammed Shami: రెండో టీ20.. టీమిండియాలోకి మహ్మద్ షమీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా?

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కోల్‌కతాలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేయడం ద్వారా టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. ఇరు జట్లు నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్ ఇండియా రెండో టీ20లోనూ గెల‌వాల‌ని ప‌ట్టుద‌లగా ఉంది. శనివారం జ‌రిగే మ్యాచ్‌లో గెలుపొంది త‌మ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని భార‌త్ భావిస్తోంది. ఏ ప్లేయింగ్ ఎలెవన్‌తో భారత్ ఈ మ్యాచ్ ఆడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి (Mohammed Shami) ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇస్తుందని భావించినా అది జ‌ర‌గ‌లేదు. అతని గైర్హాజరీలో మొదటి మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతితో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్ప‌కూల్చ‌గా.. వరుణ్ చక్రవర్తి కూడా రాణించాడు.

Also Read: CM Revanth: మంత్రుల‌తో సమావేశ‌మైన సీఎం రేవంత్‌.. ఏం చ‌ర్చించారంటే?

చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఉపయోగప‌డుతుందా?

గతంలో ఇక్కడ జరిగినట్లుగానే చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార‌ణంతో వరుణ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌ల స్పిన్ త్రయం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌కు స్పిన్ కమాండ్ ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టన్ చేతుల్లో ఉంది. చెపాక్‌లోని క్లిష్ట పిచ్‌పై ఇరు జట్ల స్పిన్నర్ల ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించవచ్చు. పిచ్ ఈ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీమిండియా షమీకి ఈ మ్యాచ్‌లో కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వొచ్చు.

భారత ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ గతేడాది నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. కోల్‌కతాలోనూ వీరిద్దరూ జట్టుకు శుభారంభం అందించారు. ఈ సమయంలో అభిషేక్ 79 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే శుక్రవారం ప్రాక్టీస్‌లో అతని చీలమండకు గాయం కావ‌డంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడతాడా? లేదా అనేది తెలియ‌దు. అభిషేక్ ఆడకపోతే కెప్టెన్ సూర్యకుమార్ స్వయంగా ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది.

రెండో టీ20కి భారత్ జ‌ట్టు అంచ‌నా

Exit mobile version