Mohammed Shami: వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి చెన్నైలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా షమీ తిరిగి జట్టులో భాగం కానున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ప్రపంచకప్ తర్వాత షమీ కుడి మడమ గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కారణంగా అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం గాయం నుంచి షమీ కోలుకుంటున్నాడు.
నివేదిక ప్రకారం షమీ ప్రస్తుతం NCAలో తన పునరావాసం చివరి దశలో ఉన్నాడు. గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఫిట్‌గా మారిన తర్వాత షమీ క్రమంగా తన బౌలింగ్ ని మెరుగుపరుచుకుని ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ప్రారంభంలో పరిమిత ఓవర్ల శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమీ బౌలింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పాడు. సెప్టెంబరు 19 నుండి చెన్నైలో బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో షమీ ఆడటం చూడొచ్చన్నాడు.
హెడ్ కోచ్ గంభీర్ షమీ రాక కోసం వెయిటింగ్. ఎప్పటికప్పుడు షమీ ఫిట్నెస్ లెవెల్స్ పై గంభీర్ ఆరా తీస్తున్నాడట. జట్టులో సరైన పేసర్ లేకపోవడం ద్వారా భారత్ మూల్యం చెల్లించుకుంది. శ్రీలంకతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ .. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. దీంతో జట్టులో ప్రక్షాళనపై గంభీర్ ఫోకస్ పెట్టాడు. షమీ వస్తే అంతా సెట్ అవుతుందని హెడ్ కోచ్ భావిస్తున్నాడు.
Also Read: Bangladesh Crisis : బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా