Site icon HashtagU Telugu

Mohammed Shami: షమీ కీలక వ్యాఖ్యలు.. ప్రాక్టీస్ కు ఎప్పుడూ దూరంగా లేను..!

Mohammed Shami

Mohammed Shami

అడిలైడ్ ఓవల్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. 32 ఏళ్ల షమీ ఎప్పుడూ ప్రాక్టీస్‌కు దూరంగా లేనని, ఎల్లప్పుడూ తన అభ్యాసాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు. బుధవారం బంగ్లాదేశ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించిన తర్వాత షమీ మాట్లాడుతూ.. ఇదంతా ప్రిపరేషన్‌పై ఆధారపడి ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ మమల్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని చెబుతుందని తెలిపాడు.

టీమిండియా జట్టుకు అవసరమైనప్పుడు మీకు కాల్ వస్తుందని మాకు మేనేజ్ మెంట్ చెబుతూనే ఉంటుంది. మీరు నా వీడియోలను చూసినట్లయితే నేను ఎప్పుడూ నా శిక్షణను కొనసాగిస్తానని షమీ వివరించాడు. టీ20 ప్రపంచ కప్ కు ముందు షమీ కరోనా కారణంగా సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ లకు దూరం అయిన విషయం తెలిసిందే. బుధవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో షమీ 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.