Site icon HashtagU Telugu

Mohammed Shami: ప్రపంచకప్ ఓటమిపై షమీ ఎమోషనల్

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: ప్రపంచకప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా స్పందించాడు. ప్రపంచకప్‌లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు. ఆరంభం నుంచి ఎలా ఆడుతున్నామో, చివరి వరకు అదే జోరును కొనసాగించి ఫైనల్‌లో విజయం సాధించేందుకు 100 శాతం ప్రయత్నించాం. కానీ చివరికి ఎక్కడ తప్పు చేశామో ఖచ్చితంగా చెప్పలేమని, ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని షమీ అన్నాడు.

ప్రపంచకప్ లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ విలయతాండవం చేశాడు. అనుకోకుండా జట్టులో స్థానం దక్కించుకున్న షమీ టోర్నీలో చివరి వరకు టీమిండియాకు అండగా నిలిచాడు. షమీ కేవలం 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. సెమిస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలోనే 50కి పైగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డులను షమీ సాధించాడు. మెగా టోర్నీ తర్వాత షమీ జట్టుకు దూరమయ్యాడు ఫిట్నెస్ కారణంగా షమీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు.

Also Read: Prabhas Salaar: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సలార్, 500 కోట్లతో భారీ వసూళ్లు