Site icon HashtagU Telugu

India vs England: ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డే టీమిండియా జట్టు ఇదే.. ష‌మీకి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ!

Mohammed Shami

Mohammed Shami

India vs England: ఇంగ్లండ్‌తో టీం ఇండియా (India vs England) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను సూర్యకుమార్‌ యాదవ్‌కు అప్పగించారు. ఇదే సమయంలో సెలక్టర్ల నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సిరీస్‌కు కొత్త వైస్ కెప్టెన్‌ని ఎంపిక చేశారు. మహమ్మద్ షమీ లాంటి స్టార్ బౌలర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఈ ఆటగాడు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు

ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను ఎప్పుడూ టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ జట్టుకు కెప్టెన్‌గా చేసిన అనుభ‌వం ఉంది. అయితే సంజూ శాంసన్ జట్టులో ఉండటంతో సెలక్టర్ల ఈ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. శాంస‌న్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతని కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసింది.

Also Read: Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం

నితీష్ రెడ్డికి చోటు దక్కింది

ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కూడా జట్టులో ఉన్నారు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ బ్యాటింగ్ చేయనున్నారు. షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. 2023 నవంబర్‌ 19న వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత టీమిండియాకు ఆయ‌న ప్రాతినిథ్యం వహించలేదు.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

భారత పర్యటనకు ఇంగ్లండ్ టీ20 జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్