Site icon HashtagU Telugu

Arjuna Awards : చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలకు ఖేల్ రత్న.. ష‌మీ, అజయ్ కుమార్‌లకు అర్జున ప్రదానం

Arjuna Awards

Arjuna Awards

Arjuna Awards : జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్‌లో సంచలన బౌలింగ్ చేసిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ ష‌మీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డును ప్రదానం చేశారు. అంధుల క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డును అందజేశారు.  గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోయారు. 2010లో భారత జట్టులో చోటు దక్కించుకున్న అజయ్ కుమార్.. 2012లో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్‌, 2014లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016లో అతడు భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌  ఆర్‌.వైశాలీ, పిస్టల్‌ షూటింగ్‌ సెన్సేషన్‌ ఈషా సింగ్‌, రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌, బాక్సర్‌ మహమ్ముద్‌ హుస్సాముద్దీన్‌, పారా ఆర్చర్‌ సీతల్‌ దేవీ తదితరులు అర్జున అవార్డును పొందారు. ఈసారి మొత్తం 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు(Arjuna Awards) లభించింది.

We’re now on WhatsApp. Click to Join.

బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి, సాత్విక్‌రాజ్ రంకిరెడ్డికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కింది.  చెస్‌ కోచ్‌, ప్రజ్ఞానందా గురువు రమేశ్‌ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు.గణేష్ ప్రభాకరన్ (మల్లాఖాంబ్), మహావీర్ సైనీ (పారా అథ్లెటిక్స్), లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్‌బి రమేష్ (చెస్), శివేంద్ర సింగ్ (హాకీ)లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. గోల్ఫ్ కోచ్ జస్కీరత్ సింగ్ గ్రేవాల్, భాస్కరన్  (కబడ్డీ, కోచ్), జయంత్ కుమార్ పుసిలాల్ (టేబుల్ టెన్నిస్, కోచ్)లకు లైఫ్ టైమ్ అవార్డు లభించింది. ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుకు రూ.25 లక్షలు, అర్జున, ద్రోణాచార్య అవార్డులకు రూ. 15 లక్షల నగదు, మెమెంటో ప్రదానం చేస్తారు. సాధారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి అయిన ఆగస్టు 29న జరగాల్సి ఉండగా…గతేడాది హాంగ్జౌలో సెప్టెంబర్‌ 23నుంచి అక్టోబర్‌ 8వరకు  ఆసియా క్రీడలు జరగటంతో వాయిదా వేశారు.

Also Read: 30 Years Silence : 30 ఏళ్లుగా మౌనవ్రతం.. అయోధ్య రాముడి అపర భక్తురాలు

అర్జున అవార్డులు అందుకున్నది వీరే..