టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జగజ్జేతగా నిలిచింది. పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మెల్ బోర్న్ లో పాకిస్తాన్ కలలు చెదిరిపోయాయి. అదే సమయంలో టీమిండియా మహ్మద్ షమీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచకప్ లో ఓటమిపాలయ్యాక…పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరిగిన హృదయంతో కూడిన ఎమోజీని ట్వీట్ చేశాడు. దానికి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బదులిచ్చాడు. ఇది వైరల్అయ్యింది. క్షమించండి సోదరా…దీన్నే కర్మ అంటారు అంటూ షమీ రీకామెంట్ చేశారు.
Sorry brother
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 13, 2022
షోయబ్ అక్తర్ టీమిండియాను విమర్శిస్తూ…సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోతే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫైనల్లో ఓడిపోవడంతో షమీ రీవెంజ్ తీర్చుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే అక్తర్ ట్వీట్ కు రీట్వీట్ చేశాడు షమీ. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది. షమీ చేసిన ట్వీట్ ను నెటిజన్లు సమర్థిస్తున్నారు. షమీ రాకీ భాయ్ మోల్ వచ్చి కాల్పులు జరుపుతున్నట్లు వీడియోలు వైరల్ గా మారాయి.
https://twitter.com/gururajwrites/status/1591761495381409792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591761495381409792%7Ctwgr%5E5c9b09a305766a1f25347c864f62e5abf422c45d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Fmohammad-shami-tweet-on-shoaib-akhtar-karma-reaction-pakistan-vs-england-t20-world-cup-2022-final-result-tspo-1574693-2022-11-13