Site icon HashtagU Telugu

Mohd Shami: భారత్ కు షాక్…ఆ స్టార్ బౌలర్ ఔట్

Mohammed Shami

Mohammed Shami

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న టీ ట్వంటీ సీరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో సీరీస్ కు డూ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటించిన జట్టులో షమీ చోటు దక్కంచుకున్నాడు. వరల్డ్ కప్‌కు స్టాండ్ బై ప్లేయర్ గానూ ఎంపికయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతి సీరీస్ మంచి ప్రాక్టీస్ అవుతుందని అంతా భావించారు.

అయితే ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో షమీ సీరీస్ నుంచి తప్పుకున్నాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో జరిగే సీరీస్ కు షమీ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ షమీ సౌతాఫ్రికా సిరీస్‌లో బాగా పెర్ఫామ్ చేస్తే వరల్డ్ కప్ జట్టులో ఫైనల్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. అయితే షమీకి కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన పని లేదనీ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నెగెటివ్ గా తేలిన తర్వాత తిరిగి జట్టులో చేరుతాడనీ, బీసీసీఐ మెడికల్ టీమ్ షమీ పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపింది. ఆస్ట్రేలియాతో మూడు టీ ట్వంటీల సీరీస్ మంగళవారం నుంచి ఆరంభం కానుంది.తొలి మ్యాచ్ కు మొహాలీ ఆతిథ్యం ఇవ్వనుంది.

Exit mobile version