మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం!

ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో మొహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉంది. 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును దాటలేకపోయారు.

Published By: HashtagU Telugu Desk
Mohammad Rizwan

Mohammad Rizwan

Mohammad Rizwan: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం జరిగింది. బిగ్ బాష్ లీగ్ (BBL)లో సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున బ్యాటింగ్‌కు దిగిన రిజ్వాన్‌ను కొద్దిసేపు ఆడిన తర్వాత మేనేజ్‌మెంట్ అకస్మాత్తుగా మైదానం నుండి బయటకు పిలిపించింది. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో రిజ్వాన్ స్వయంగా ఆశ్చర్యపోయారు. ఇష్టం లేకపోయినా ఆయన పెవిలియన్ వైపు వెళ్లాల్సి వచ్చింది. మైదానం మధ్యలో జరిగిన ఈ అవమానంతో ఆయన ముఖం చిన్నబోయింది.

రిజ్వాన్‌కు జరిగిన అవమానం ఏమిటి?

మొహమ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు. అయితే ఆయన ఏ మాత్రం ఫామ్‌లో ఉన్నట్లు కనిపించలేదు. ఒక్కో పరుగు కోసం చాలా కష్టపడ్డారు. 23 బంతులు ఆడిన రిజ్వాన్ కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇందులో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంటే ఆయన చాలా డాట్ బాల్స్ ఆడారు. దీనివల్ల అవతలి వైపు ఉన్న బ్యాటర్‌పై ఒత్తిడి పెరిగింది.

Also Read: జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్

దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆయన్ని ‘రిటైర్డ్ అవుట్’ చేస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిపించింది. నిబంధనల ప్రకారం.. ఒకసారి రిటైర్డ్ అవుట్ అయిన బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండదు. అందుకే రిజ్వాన్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ దక్కలేదు.

ఈ సీజన్‌లో రిజ్వాన్ ఘోర వైఫల్యం

ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో మొహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉంది. 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆయన స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా కాలంగా పాకిస్థాన్ టీ20 జట్టుకు కూడా రిజ్వాన్ దూరంగా ఉంటున్నారు. బిగ్ బాష్‌లో రాణించి మళ్లీ జట్టులోకి రావాలని ఆశించిన రిజ్వాన్‌కు ఈ తాజా పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

  Last Updated: 12 Jan 2026, 06:28 PM IST