Site icon HashtagU Telugu

PAK VS NEP: విచిత్రంగా రిజ్వాన్ రన్ అవుట్.. అశ్విన్ ట్వీట్ వైరల్

PAK VS NEP

New Web Story Copy 2023 08 31t151809.624

PAK VS NEP: రిజ్వాన్ స్వీప్ షాట్లు ఆడేందుకు ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే నేపాల్ తో మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఉత్సహం చూపించిన రిజ్వాన్ మ్యాచ్ లో హెల్మెట్ పెట్టుకోకుండానే బరిలోకి దిగాడు. పాపం అదే అతన్నికొంపముంచింది. హెల్మెట్ లేక‌పోవ‌డం అత‌డిని ర‌నౌట్ అయ్యేలా చేసింది. 23వ ఓవ‌ర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. సందీప్ ల‌మిచానే బౌలింగ్‌లో రిజ్వాన్ బౌండ‌రీ బాదాడు. ఆ త‌ర్వాత బంతిని ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. అక్క‌డ ఉన్న ఫీల్డ‌ర్ దీపేంద‌ర్ సింగ్ ఐరీ బంతిని అందుకొని వేగంగా బౌల‌ర్ వైపు విసిరాడు. బంతి తనకు ఎక్కడ తగులుతుందోనని త్రోకి భయపడి రిజ్వాన్‌ గాల్లోకి ఎగిరాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకింది. హెల్మెట్ పెట్టుకోని ఉంటే రిజ్వాన్‌ ఇలా భయపడి గాల్లోకి ఎగిరేవాడు కాదని టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అలంటి పరిస్థితుల్లో బ్యాటర్లు తమ వికెట్ కాపాడుకునేందుకు డైవ్ చేస్తారు. కానీ, రిజ్వాన్ అలా చేయ‌లేదు. బంతి ఎక్క‌డ త‌న త‌ల‌కు త‌గులుతుందేమో అనే భ‌యంతో క‌నిపించాడు. అశ్విన్‌ చెప్పింది నిజమేనని క్రికెట్ ఫ్యాన్స్‌ అంటున్నారు.

రిజ్వాన్ అవుట్ అయిన తీరుపై నెటిజన్స్ ఒక్క్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ అంటే అంతే ఉంటుంది మరి.. చిత్ర విచిత్రంగా మిస్‌ ఫీల్డ్‌లు చేయడం.. క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం.. అనూహ్యమైన రీతిలో రన్‌అవుట్లు అవ్వడం పాక్‌కి వెన్నతో పెట్టిన విద్య. బేసిక్స్ కూడా తెలియవు అంటూ పాక్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసియ కప్ ఆరంభ మ్యాచ్ లో పాకిస్థాన్ నేపాల్ ని చిత్తూ చేసింది. ఈ మ్యాచ్ లో పాక్ నేపాల్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పాపం నేపాల్ రెండంకెల స్కోర్ చేయడానికి ఇబ్బందిపడితే పాక్ ఏకంగా మూడంకెల స్కోర్ తో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ బాబర్ ఆజం 151 భారీ స్కోర్ రాబట్టగా,న్ ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ నేపాల్‌పై 44 ప‌రుగులతో సరిపెట్టుకున్నాడు.

Also Read: Pakistan vs India: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా చూడొచ్చు..!