Site icon HashtagU Telugu

Cheteshwar Pujara: జట్టులో చోటే డౌట్ గా ఉన్న ప్లేయర్ కు వైస్ కెప్టెన్సీనా..?

Cheteshwar Pujara

Cheteshwar Pujara

భారత క్రికెట్ (Team India) జట్టులో ప్రయోగాలు మితీమీరుతున్నాయా.. సెలక్టర్లు సిరీస్ కో నిర్ణయం తీసుకుంటూ జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారా అంటే అవుననే అంటున్నారు మాజీ ఆటగాళ్ళు. గత ఏడాది కాలంగా కెప్టెన్సీ మ్యూజికల్ ఛైర్ ఆడినట్టు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ విషయంలో చెత్త ప్రయోగాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా చటేశ్వర పుజారా (Cheteshwar Pujara)ను నియమించడంతోనే ఈ చర్చ మొదలైంది.

కొన్ని రోజుల క్రితం అసలు జట్టులో పుజారా (Cheteshwar Pujara) చోటుపైనే సందిగ్ధత నెలకొంది. ఒక స్టేజ్ తో జట్టుకు దూరమైన పుజారా కౌంటీ క్రికెట్ లో ఫామ్ అందుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న పుజారాను వైెస్ కెప్టెన్ గా చేసి ఉపయోగమేంటనేది చాలా మంది మాజీల ప్రశ్న. బంగ్లా సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న పుజారా.. ఆ తర్వాత జరిగే శ్రీలంక సిరీస్‌లో ఆడటం లేదు. టెస్టు క్రికెట్‌లో పుజారా అద్ఙుతమైన బ్యాటర్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

అయితే అతని వయసే ఇక్కడ చర్చకు కారణమైంది. భవిష్యత్తులో జట్టు పగ్గాలు అందుకునే అవకాశం పుజారాకు ఏమాత్రం లేదు. దీంతో పుజారా స్థానంలో యువ ఆటగాళ్ళను ఎంపిక చేసి భవిష్యత్తు జట్టును సిద్ధం చేసుకోవాలన్నది చాలా మంది అభిప్రాయం. ఇంగ్లండ్ టూర్ పంత్ ను వైస్ కెప్టెన్ గా చేసినప్పుడు జట్టులో పుజారా కూడా ఉన్నాడు. అప్పుడు పుజారాను ఎందుకు చేయలేదని కైఫ్ లాంటి మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సిరీస్ లకు పంత్ ను వైస్ కెప్టెన్ గా చేసి మళ్ళీపుజారా వైపు వెళ్లడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా సెలక్టర్ల ప్రయోగాలు జట్టుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!