అనవసర ప్రయోగాలే కోల్ కతా కొంపముంచాయి – కైఫ్

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభంలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది. తుది జట్టు ఎంపికలో లోపాలు, అనవసరపు ప్రయోగాల కారణంగా ఐదు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 04:52 PM IST

ఐపీఎల్ లో రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన కేకేఆర్‌ చెత్త ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు కూడా మండిపడుతున్నారు.. ఇదిలాఉంటే.. తాజాగా కేకేఆర్ జట్టుపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ అత్యుత్తమ ఆటగాళ్లనే దక్కించుకున్నప్పటికీ.. తుది జట్టులో అనవసరపు మార్పులు చేయడం వల్ల జట్టు సమతుల్యత చెడిపోయిందన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చాలా మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లున్నారనీ, అయితే వారందరికీ తుది జట్టులో ఛాన్స్ అనేది దక్కదన్నాడు.. అందరికి అవకాశమివ్వాలనే ఆలోచనతో జట్టులో భారీగా మార్పులు చేయడంకో ఫలితంగా జట్టు సమతుల్యత దెబ్బతిని వరుసగా ఓడిపోయిందని కైఫ్ విశ్లేషించాడు.

అలాగే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మధ్య కూడా విభేదాలున్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ వైపు నడుస్తూ డగౌట్ లో ఉన్న హెడ్ కోచ్ మెక్‌కల్లమ్ పై అరుస్తూ కనిపించాడు. శ్రేయాస్ అయ్యర్ ,మెక్‌కల్లమ్ మధ్య విభేదాలున్నాయని ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తోందని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన కోల్ కతా 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్ లలో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు మిగిలన రెండు మ్యాచ్ లూ గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.