IPL 2022 : కైఫ్ ఆల్‌టైం ఐపీఎల్ ఎలెవెన్‌ ఇదే

టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంచుకున్న కైఫ్.. టీమిండియా నుంచి ఐదుగురు ఆటగాళ్లను, ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించాడు.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 12:34 PM IST

టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంచుకున్న కైఫ్.. టీమిండియా నుంచి ఐదుగురు ఆటగాళ్లను, ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించాడు. కైఫ్ ప్రకటించిన జట్టులో ఆసీస్‌ ఆటగాడు ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌కు చోటు కల్పించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకడిగా ఉన్న డేవిడ్ వార్నర్‌ కు చోటు కల్పించి ఉంటే జట్టు మరింత బావుండేదని వార్నర్‌ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

తన ఆల్‌టైం ఐపీఎల్ జట్టుకు ఓపెనర్లుగా వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌, ముంబై ఇండియన్స్ సీనియర్ ఓపెనర్ రోహిత్‌ శర్మలను ఎంచుకున్న కైఫ్.. వన్‌డౌన్‌లో ఆర్సీబీ మాజీ సారథి విరాట్‌ కోహ్లి, నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు
సురేష్ రైనాను ఎంపిక చేశాడు. అలాగే మహ్మద్ కైఫ్ ఐపీఎల్‌ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ను ఎంపిక చేయగా తన జట్టులో ఆరో స్థానం కోసం అలాగే వికెట్ కోటాలో ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు. ఇక మహ్మద్ కైఫ్ తన జట్టులో ఆల్ రౌండర్ విభాగంలో కేకేఆర్ సినియర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను ఎంపిక చేయగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కొట్టాలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు రషీద్ ఖాన్, కేకేఆర్ సీనియర్ ఆటగాడు సునీల్ నరైన్ ను ఎంపిక చేశాడు. అలాగే మహ్మద్ కైఫ్ తన జట్టులో పేసర్ల విభాగంలో ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగ, అదే ముంబైఇండియన్స్ యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు..

ఇక మహ్మద్ కైఫ్ ఐపీఎల్‌ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు ఎంఎస్ ధోని సారథిగా ఉండగా.. ఆ జట్టులో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు చోటు దక్కించుకున్నారు.