Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?

ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.

  • పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే
  • భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు
  • మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె

Paris Olympics 2024: ఈసారి పారిస్ ఒలింపిక్స్ భారతదేశానికి మరింత ప్రత్యేకం కానున్నాయి, ఎందుకంటే బీహార్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ఇందులో పాల్గొనబోతున్నారు. షార్ట్ గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్‌లో పాల్గొననున్న ఆమె పేరు శ్రేయసి సింగ్. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు నిర్వహించనున్నారు.

భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. దేశప్రజలు మరో స్వర్ణం కోసం ఎదురు చూస్తున్న గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. కానీ ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్(MLA Shreyasi Singh) మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) కుమార్తె. బీహార్‌లోని జముయి(Jamui constituency) నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.

2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్యం, రజతం తర్వాత ఇప్పుడు దేశానికి బంగారు పతకం సాధిస్తుందని దేశం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. శ్రేయాసి సింగ్ రాజకీయ కుటుంబ నేపధ్యం నుంచి వచ్చింది. ఆమె తల్లి ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. తండ్రి మాజీ కాంగ్రెస్ ఎంపీ. ఇక క్రీడలకు శ్రేయాసి సింగ్ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని 2018లో అర్జున అవార్డుతో ఆమెను సత్కరించారు. కాగా భారత్ నుంచి 47 మంది మహిళలు, అరవై ఐదు మంది పురుష అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటారు.(Paris Olympics 2024)

Also Read: RBI Penalty: మూడు ఫైనాన్స్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకున్న ఆర్బీఐ.. కార‌ణ‌మిదే..?

Follow us