Site icon HashtagU Telugu

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై!

Mithali

Mithali

భారత క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. 39 ఏళ్ల మిథాలీ తన 23 ఏళ్ల కెరీర్‌ను గుడ్ బై చెప్పేసింది. ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. మిథాలీ అన్ని ఫార్మెట్లలో అత్యధికంగా ఆడిన భారత మహిళా క్రికెటర్‌గా మాత్రమే కాకుండా, భారతదేశం తరపున 333 మ్యాచ్‌లు ఆడిన 10,868 పరుగులతో మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా కూడా రిటైరైంది. ” ఎన్నో ఏళ్లుగా చూపిస్తున్న మీ ప్రేమ & మద్దతుకు ధన్యవాదాలు! మీ ఆశీర్వాదం, మద్దతుతో నా 2వ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నా”  అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. “కొంతమంది యువ ప్రతిభావంతులతో జట్టు బలంగా ఉంది. భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది కాబట్టి నా ఆట కెరీర్‌ ను ముగించడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసింది.

అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత లాంటి అవార్డులను సొంతం చేసుకున్న మిథాలీ 1999లో తన 16వ ఏట క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలలో ఆల్ టైమ్ గ్రేట్‌లలో ఒకరిగా మారింది. మిథాలీ యుక్తవయసులో పలు విజయాలను నమోదు చేసింది. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ కొట్టింది. ఐర్లాండ్‌పై ఆమె అజేయంగా 114 పరుగులు చేసి మహిళల క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలుగా సెంచరీ చేసింది. వన్డేల విషయానికొస్తే, ఇప్పటి వరకు మిథాలీ గొప్ప రికార్డును కలిగి ఉంది.

Exit mobile version