Mitchell Starc: ఐపీఎల్ పై మిచెల్ స్టార్క్ షాకింగ్ కామెంట్స్

వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గౌతమ్ గంభీర్ మెంటర్ టీమ్ కేకేఆర్ అతన్ని వేలంలో 24.75 కోట్లకు

Mitchell Starc: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు 77 మంది ఆటగాళ్ల కోసం దుబాయ్‌లో వేలం జరిగింది. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గౌతమ్ గంభీర్ మెంటర్ టీమ్ కేకేఆర్ అతన్ని వేలంలో 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలం తర్వాత మొదటి సారి స్పందించిన స్టార్క్ షాకింగ్ చేశాడు.

ఐపీఎల్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినప్పటికీ, టెస్టు క్రికెట్ ఆడటమే తనకు అత్యంత ప్రాధాన్యత అని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వెల్లడించాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్టులో భారీ తేడాతో పాక్ ని మట్టికరిపించిన ఆసీస్ రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతోంది. అయితే పాకిస్థాన్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు మిచెల్ స్టార్క్ విలేకరులతో ముచ్చటించాడు.

మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ.. నేను ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తాను. క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో పూర్తి సమయాన్ని కుటుంబానికి వెచ్చిస్తాను. అదేవిధంగా ఫిట్ గా ఉండటానికి ట్రై చూస్తుంటానని చెప్పాడు. మిచెల్ స్టార్క్ 8 సంవత్సరాలు ఐపిఎల్‌కు దూరంగా ఉండటం గురించి కూడా మాట్లాడాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అతని ఆట కూడా మెరుగుపడింని చెప్పాడు. డబ్బు ఖచ్చితంగా మంచిదే కానీ నేను ఐపీఎల్‌లో ఆడకపోవడం నాకు మేలు చేసిందని, నా ఆటకు ఎంతగానో ఉపయోగపడినని చెప్పాడు.

మిచెల్ స్టార్క్ చివరిసారిగా 2015లో ఐపీఎల్‌లో ఆడడం గమనార్హం. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు కుటుంబంతో గడపడానికి 8 ఏళ్ల పాటు ఈ లీగ్‌లో ఆడలేదు. స్టార్క్ ఐపీఎల్ లో 27 మ్యాచ్‌ల్లో 17.06 సగటుతో 34 వికెట్లు తీశాడు. ఈ ఏడాది 24.75కి అమ్ముడుపోయిన స్టార్క్ రానున్న ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఎలా రాణిస్తాడో చూడాలి.

Also Read: Hair Tips: జుట్టు పల్చగా ఉందని బాధపడుతున్నారా.. అయితే ఇది రాస్తే చాలు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాల్సిందే!