Mitchell Starc Retirement: ఐపీఎల్ 2024 వేలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి కొనుగోలు చేయబడిన స్టార్క్, 2015 తర్వాత మొదటిసారిగా ఐపీఎల్ ఆడేందుకు తిరిగి వచ్చాడు. స్టార్క్ విలువ రూ. 24.75 కోట్లు. అయితే ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న స్టార్క్ ప్లేఆఫ్స్ లో అదరగొట్టాడు. ఒక్క మ్యాచ్ తో కేకేఆర్ హీరో అనిపించుకున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన కెరీర్‌కు సంబంధించి సంచలన హింట్ ఇచ్చాడు. 24.75 కోట్ల రూపాయల ధర కలిగిన స్టార్క్ భవిష్యత్తు ఐపీఎల్ లో మరింత రాణిస్తానని చెప్తూనే ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ.. 9 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాధాన్యత ఇచ్చానని, అయితే ఇప్పుడు కెరీర్ ముగింపు దశకు చేరుకుందని చెప్పాడు. స్టార్క్ 2015 తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన ఈ పేసర్ చెన్నై చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై స్టార్క్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వచ్చే ఏడాది కూడా తాను కేకేఆర్ లో భాగం కావాలనుకుంటున్నానని స్టార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తదుపరి వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది అని స్టార్క్ చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ వన్డే ఫార్మాట్‌ని కొనసాగించగలనా లేదా అనేది తెలియదు. ఈ ఐపీఎల్ సీజన్‌ను చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. కాగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టులో చేరనున్నాడు.
Also Read: Dipa Karmakar: 30 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్