IPL auction 2024: ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరుగుతున్న వేలంలో రికార్డులు బద్ధలవుతున్నయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆటగాళ్లు అమ్ముడుపోతున్నారు. ఆయా ఫ్రాంచైజీలు కోట్లను కుమ్మరిస్తున్న పరిస్థితి. 2024 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వేలంలో కలకత్తా నైట్ రైడర్స్,గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.ఇదే వేలంలో 20.5 కోట్లు పలికి రికార్డ్ క్రియేట్ చేసిన పాట్ కమిన్స్ ను అధిగమించి భారీ ధరకు అమ్ముడుపోయాడు.
మిచెల్ స్టార్క్ ని 24.75 కోట్ల భారీ ధర పెట్టీ కలకత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలం లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లో కేవలం రెండు సీజన్స్ మాత్రమే ఆడాడు. దాదాపు 8 ఏళ్ల తరువాత మళ్ళీ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కేవలం 2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన మిచెల్ స్టార్క్ ని సొంతం చేసుకునేందుకు 24.75 వెచ్చించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇటీవల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా జట్టుకు సారధ్యం వహించి అద్భుతంగ ముందుగా నడిపించాడు. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఆసీస్ ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి సత్తా చాటింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన ఆసీస్ కప్ గెలిచి సత్తా చాటింది.
Also Read: Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!