Site icon HashtagU Telugu

Argentina players: అర్జెంటీనా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

arg players

Cropped (2)

ఫిఫా ప్రపంచకప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా (Argentina) జట్టు స్వదేశానికి చేరుకుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు (Argentina players) అభిమానులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మెస్సీ సహా కీలక ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. ఫుట్ బాల్ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలో పర్యటిస్తున్నప్పుడు మెస్సీతో సహా ఐదుగురు ఆటగాళ్లు ట్రోఫీతో బస్సు పైన కూర్చున్నారు. ఈ క్రమంలో క్రీడాకారులకు విద్యుత్ వైరు అడ్డుగా వచ్చింది. మొదట తీగలను గమనించలేదు. దగ్గరికి రాగానే.. గమనించిన ఓ ఆటగాడు.. మిగతా వారందరినీ అప్రమత్తం చేశాడు.

Also Read: Viral Video: ఖడ్గమృగం బిడ్డకు జన్మనిచ్చే అరుదైన వీడియో వైరల్​

చివరి క్షణంలో ఆటగాళ్లంతా కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది. అయితే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం లేకున్నా, తీగలు తగిలితే పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బ్యూనస్ ఎయిర్స్‌లో అర్జెంటీనా ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆటగాళ్లందరూ బస్సులో విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆటగాళ్లంతా ట్రోఫీతో పాటు ఓపెన్ బస్సు నుంచి అభిమానులకు ట్రోఫీని చూపిస్తూ సందడి చేశారు.