Mirabai Chanu: కామ‌న్వెల్త్ గేమ్స్ కి అర్హ‌త సాధించిన మీరాబాయి చాను

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 10:05 AM IST

శుక్ర‌వారం జ‌రిగిన సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో మీరాబాయి చాను స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచారు. స్వర్ణం గెలిచిన తర్వాత మీరాబాయి చాను కామ‌న్వెల్త్ గేమ్స్ 2022కి అర్హత సాధించారు. సింగపూర్ వెయిట్‌లిఫ్టింగ్ ఇంటర్నేషనల్‌లో మొత్తం 191 కిలోలు ఎత్తి 55 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. దీంతో మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. తొలిసారిగా 55 కేజీల విభాగంలో పోటీ పడుతున్న చాను 191 కేజీలు (86 కేజీలు+105 కేజీలు) ఎత్తి పోటీ లేని మైదానంలో పోడియంపై అగ్రస్థానంలో నిలిచారు.

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన తర్వాత భారత వెయిట్‌లిఫ్టర్ తన కీర్తి మ‌రింత పెరిగింది. మహిళల 49 కేజీల విభాగంలో చివరి వరకు ధైర్యంగా పోరాడి రజతం సాధించింది. అప్పటి నుండి ఒలింపియన్ వృద్ధిని కొనసాగించింది. ఈవెంట్-ప్యాక్డ్ 2022 సీజన్ కోసం రోజు విడిచి రోజు శిక్షణ చేస్తూ తన చెమటను ధార‌పోస్తుంది. కామ‌న్వెల్త్ గేమ్స్ లో అర్హ‌త సాధించింనందుకు ఆమె ఆనందం వ్య‌క్త‌ప‌రిచారు. ఏడు నెలల తీవ్రమైన శిక్షణ, క్రీడ పట్ల త‌నకు అంతులేని ప్రేమ ప్రతిఫలిస్తూనే ఉందని ఆమె తెలిపారు. క్రీడామంత్రిత్వ శాఖ, వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. SAI, IOS స్పోర్ట్స్ త‌నకు సహకరించిన అంద‌రికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. కామ‌న్వెల్త్ గేమ్స్ లో దేశం కోసం మళ్లీ బంగారు పతకాన్ని సాధించడానికి తాను మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాన‌ని ఆమె తెలిపింది.

కామ‌న్వెల్త్ గేమ్స్ లో క్వాలిఫికేషన్ ఈవెంట్ ప్రతి విభాగంలోని టాప్ 8 లిఫ్టర్‌లను బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించడానికి అనుమతిస్తుంది. ఇందులో చాను 49 కిలోల విభాగంలోనే కాకుండా 55 కిలోల విభాగంలో భారతదేశానికి కూడా స్థానం కల్పించారు. .27 ఏళ్ల చాను తన కామన్వెల్త్ ర్యాంకింగ్స్ ఆధారంగా 49 కేజీల బరువు విభాగంలో అర్హ‌త సాధించారు.