Site icon HashtagU Telugu

RCB: ఆర్సీబీ నుంచి ఆ ఇద్దరూ ఔట్.. జట్టు ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌..!

RCB

Compressjpeg.online 1280x720 Image (2)

RCB: వచ్చే ఐపీఎల్ కోసం ఆర్సీబీ (RCB) ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అయితే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభమై పదహారు సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా కప్ నెగ్గలేదు. మంచి టీమ్ ఉన్నా.. కప్ రాలేదు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం కీలక మార్పులు చేస్తుంది. RCB టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెస్సన్(Mike Hesson), హెడ్ కోచ్ సంజయ్ బంగర్‌ (Sanjay Bangar)ను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచిన జట్టు 7 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. RCB టాప్ 4 జట్లలోకి ప్రవేశించింది. కానీ ఛాంపియన్‌ కాలేకపోయింది. ఇప్పుడు RCB మరో కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన కోచ్ సంజయ్ బంగర్, మైక్ హెస్సన్ తమ బాధ్యతల నుంచి తప్పించింది. టీమ్‌తో వీరిద్దరి కాంట్రాక్ట్ ముగిసింది. RCB.. తన జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమించింది.

RCB కొన్ని చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో మైక్ హెస్సన్, సంజయ్ బంగర్‌లకు టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. హెస్సన్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. బంగర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. మైక్ హెస్సన్, సంజయ్‌కి ధన్యవాదాలు అని టీమ్ ట్వీట్ చేసింది. వారిద్దరి వర్క్ ఎథిక్స్ ఎప్పుడూ ప్రభావవంతంగానే ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలలో చాలా మంది యువకులకు నేర్చుకునే అవకాశం ఇచ్చారు. వారు విజయం సాధించారు. వీరిద్దరి పదవీకాలం ముగిసింది. మైక్, సంజయ్‌లకు భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది.

Also Read: Kohli- Rohit: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటే టీమిండియా కష్టమేనా..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం గమనార్హం. 2020లో జట్టు నాలుగో స్థానంలో ఉంది. 14 మ్యాచ్‌లలో 7 గెలిచింది. 7 మ్యాచ్ లలో ఓటమిని చూసింది. ఆర్సీబి ఎలిమినేటర్ వరకు ప్రయాణించింది. ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. దీని తర్వాత 2021లో ఎలిమినేటర్‌లోనూ ఓటమి చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. 2022 ఎలిమినేటర్‌లో విజయం సాధించడం ద్వారా జట్టు రెండో క్వాలిఫైయర్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు. RCB 2023లో ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. 2023 ఐపీఎల్‌లో పలువురు గాయపడటంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. 2024 ఐపీఎల్ కి ముందు మినీ వేలం నిర్వహిస్తారు. ఆటగాళ్లు కూడా మారే అవకాశం ఉంది.

Exit mobile version