IPL 2024: ఐపీఎల్ నుంచి పంత్ అవుట్?

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా కీపర్ రిషబ్ పంత్ కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇప్పటికే బీసీసీఐ పంత్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది

IPL 2024: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా కీపర్ రిషబ్ పంత్ కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇప్పటికే బీసీసీఐ పంత్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది. పంత్ కోలుకున్నాడని, ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడంటూ తీపి కబురు అందించింది. వచ్చే వరల్డ్ కప్ కోసం సిద్దమవుతున్నాడని ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందానికి అవుదుల్లేవు. అయితే పంత్ వచ్చే ఐపీఎల్ మరియు వరల్డ్ కప్ లో కూడా ఆడబోడని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ. వచ్చే ఐపీఎల్ లో పంత్ కు చోటు దక్కకపోవచ్చని ఇషాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పంత్ కు అయిన గాయాలు చిన్నవి కాదని, తాను ఫిట్నెస్ సాధించాలి ఆంటే ఇంకా సమయం పడుతుందన్నాడు. పంత్ ఐపీఎల్ లోనే కాదు వచ్చే వరల్డ్ కప్ ఆడటం కూడా కష్టమేనంటూ అభిమానులకు షాకిచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఓ వైపు బీసీసీఐ పంత్ సిద్ధంగా ఉన్నాడని చెప్తుంటే ఇషాంత్ ఏంటి ఇలా చెప్తున్నాడంటూ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Also Read: Income Tax Day: నేడు ఆదాయపు పన్ను శాఖ రోజు.. ఇన్‌కమ్ ట్యాక్స్ డే చరిత్ర ఏంటంటే..?