Site icon HashtagU Telugu

MI vs RR: ముంబై మూడో “సారీ” రాజస్తాన్ చేతిలో చిత్తు

MI vs RR

MI vs RR

MI vs RR: ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటర్లు నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

తొలి ఓవర్ లోనే ఆ జట్టుకు ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. వరుసగా రోహిత్ శర్మ, నమన్ దిర్ లను డౌకట్ చేశాడు. ఇక్కడ నుంచి ముంబై వరుసగా వికెట్లు చేజార్చుకుంది. బ్రెవిస్ కూడా డకౌటవగా…ఇషాన్ కిషన్ 16 రన్స్ కు వెనుదిరిగాడు. అయితే తిలక్ వర్మ, కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ ఐదో వికెట్ కు 56 పరుగులు జోడించారు. చాహల్ వీరిద్దరినీ ఔట్ చేయడంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. పాండ్యా 34, తిలక్ వర్మ 32 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ వేగంగా ఆడడంతో స్కోర్ 100 దాటగలిగింది. మొత్తం మీద బ్యాటర్లు విఫలమవడంతో ముంబై ఇండియన్స్ 125 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 3 , చాహల్ 3 , బర్గర్ 2 వికెట్లు పడగొట్టారు.

We’re now on WhatsAppClick to Join.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఆరంభంలో తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 10 పరుగుకే ఔటవగా.12 పరుగులు చేసిన కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. ఆకాష్‌ మధ్వాల్‌ బౌలింగ్‌లో ఔటవగా…13 పరుగులు చేసిన బట్లర్‌.. మధ్వాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అయితే రియాన్‌ పరాగ్‌ 54 నాటౌట్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
ముంబైకి ఇది మూడో ఓటమి.

Also Read: Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య