Site icon HashtagU Telugu

IPL2022: ముంబైకి తొలి గెలుపు దక్కేనా ?

89

89

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో భాగంగా జరగనున్న 9వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. డీ వై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సీజన్‌లో, ముంబై ఇండియన్స్ జట్టు తాము ఆడిన తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోగా.. ఇక మరోవైపు ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది.. ఇక రెండు జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ముంబై , రాజస్థాన్ రెండు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా ముంబై 13 మ్యాచుల్లో, రాజస్థాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు..

ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. రాజస్థాన్ రాయల్స్ తో పోలిస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా ముంబై ఇండియన్స్ అత్యంత బలమైన జట్టని చెప్పొచ్చు…

ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌ సంజు శాంసన్ తొలి మ్యాచ్ లో తనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకోగా, సీనియర్‌ బ్యాటర్‌ జొస్ బట్లర్ , పడిక్కాల్ , హెట్ మేయర్ సూపర్ ఫామ్‌లో ఉండడం పంజాబ్ కింగ్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. బ్యాటింగ్‌లో శాంసన్ , బట్లర్ , పడిక్కాల్ , హెట్ మేయర్ .. బౌలింగ్‌లో ట్రెంట్ బోల్ట్, ప్రసీద్ క్రిష్ణ ,చాహల్, అశ్విన్ మంచి టచ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్ జట్టుకి శుభపరిణామమని చెప్పాలి..

ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాణించిన ఆ జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో కూడా రాణించాలని చూస్తున్నారు… ఇక గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పోలార్డ్ అలాగే బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, డానియల్ సామ్స్ , టైమల్ మిల్స్ కీలకం కానున్నారు.