Site icon HashtagU Telugu

MI vs RR Dream 11 Prediction: నేడు రాజస్థాన్‌ తో తాడోపెడో తేల్చుకోనున్న ముంబై ఇండియన్స్‌

MI vs RR Dream 11 Prediction

MI vs RR Dream 11 Prediction

MI vs RR Dream 11 Prediction: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కు ఓటములు వెంటాడుతున్నాయి. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబై ఘోర పరాజయం పాలైంది. గత మ్యాచ్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై బౌలర్లపై హైదరాబాద్ జట్టు ఊచకోత కోసింది. బంతి బంతికి ఫోర్లు సిక్సర్లతో ఆ జట్టు విధ్వంసం సృష్టించింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో 277 పరుగుల మార్క్ దాటింది. 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 246 పరుగులకే ఆలౌటైంది.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై మొదట గుజరాత్ చేతిలో, ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్ జరగనుంది. తొలి విజయం కోసం ముంబై సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో తమ సొంత మైదానంలో తలపడనుంది. మరోవైపు రాజస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది.

ఐపీఎల్ 14వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో జరగనుంది. వాంఖడేలో బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామం. ఈ పిచ్ పై బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపుతారు. ముంబై తమ హోమ్ గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తుంది. ఈ మైదానంలో పరుగులను అదుపు చేయడం బౌలర్లకు చాలా కష్టమైన పని. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా బంతిని బౌండరీ లైన్ దాటించడానికి బ్యాటర్లు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. వాంఖడే మైదానంలో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 109 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 50 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 59 మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ జట్టు విజయం సాధించింది. అంటే ఈ మైదానంలో లక్ష్యాన్ని ఛేదించడం సులభం.

We’re now on WhatsAppClick to Join.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.

Also Read: Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే