MI vs LSG: ఐపీఎల్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55 పరుగులు చేయగా, నికోలస్ పురాన్ 75 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. మార్కస్ స్టోయినిస్ 28 పరుగులు చేశాడు. ముంబై తరఫున ఎన్ తుషార, చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. కాగా ముంబైకి చెందిన అత్యంత విజయవంతమైన బౌలర్ పీయూష్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను వేగంగా ఆరంభించింది. తొలి ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. రెండో ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. రోహిత్ 12 బంతుల్లో 19 పరుగులు సాధించాడు. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. కొంతసేపటికి వర్షం ఆగిపోవడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వరుసగా రెండు ఫోర్లు వచ్చాయి. ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే సూర్య, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు.
లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు పరువు కోసం ఆడుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దాదాపు లక్నో కూడా ప్లేఆఫ్‌కు దూరమైంది.
Also Read: Manchu Vishnu Kannappa Release : కన్నప్ప ఆ పండగకి ప్లాన్ చేస్తున్నాడా.. పోటీ తట్టుకోగలడా..?