MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య

ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది

MI vs DC: ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమి చవిచూసింది. బుమ్రా మినహా జట్టులోని మిగతా బౌలర్లు రాణించలేకపోతున్నారు. అదే సమయంలో బ్యాటింగ్‌లోనూ జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ మూడింటిలోనూ ఓడిపోయింది. గత మ్యాచ్‌లో కేకేఆర్ పై ఢిల్లీ ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 106 పరుగుల తేడాతో ఢిల్లీని కేకేఆర్ ఓడించింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ 272 పరుగుల భారీ టార్గెట్ ఢిల్లీ ముందుంచింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ మాత్రమే రాణించారు. ఫలితంగా 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది.

ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ తిరిగి వచ్చాడు. మహ్మద్ నబీని కూడా ఈరోజు ముంబై ఇండియన్స్ రంగంలోకి దించింది. రొమారియో షెపర్డ్ కూడా ఈరోజు ప్లే 11లో భాగమయ్యాడు. ముంబై ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. 2 ఓవర్లు ముగిసేసరికి 21 పరుగులు పూర్తి చేసిన ముంబై, మూడో ఓవర్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్లో ఇషాన్ రెండు బౌండరీలు బాది 12 పరుగులు చేశాడు. 3 ఓవర్లు ముగిసేసరికి ముంబై 33 పరుగులు చేసింది. 4 ఓవర్ల సమయానికి రోహిత్ శర్మ 23 పరుగులు, ఇషాన్ 17 పరుగులు చేశారు. ఆరు ఓవర్లలో పవర్‌ప్లే 75 పరుగులు చేసింది. ఈ సమయానికి రోహిత్ శర్మ 23 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇషాన్ 20 పరుగులతో రోహిత్ కు మంచి సహకారం అందించాడు.

కాగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ 49 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో 80 పరుగుల వద్ద ముంబైకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. 2 బంతులు ఎదుర్కొని ఒక పరుగు లేకుండానే పెవియన్ చేరాడు.

We’re now on WhatsAppClick to Join

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జాయ్ రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్కియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

Also Read: MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య