Rohit Sharma: ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ మధ్యలో జరగనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరబోతున్నారనే పుకార్లు వచ్చాయి. అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్ కోచ్ అయ్యారనే వార్త తరువాత ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడైన రోహిత్ శర్మ MIని వదిలి KKR టీమ్‌లో చేరవచ్చని అభిమానులు ఊహాగానాలు చేశారు. అయితే ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ ఒక విధంగా రోహిత్ శర్మను రిటైన్ చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో కూడా అతను నీతా అంబానీ జట్టు కోసమే ఆడబోతున్నాడని స్పష్టం చేసింది.
ముంబై ఇండియన్స్ ‘రిటెన్షన్’ ప్రకటన
గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ చాలా సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టి KKRలోకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై రోహిత్ గానీ, ముంబై ఇండియన్స్ గానీ ఇంతవరకు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు MI తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా రోహిత్ శర్మ తమతోనే ఉంటాడని, అతనికి కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరే ప్లాన్ లేదని తెలిపింది.
Also Read: CM Revanth Aerial Survey : వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
ఐపీఎల్ 2026లో మరోసారి ముంబై జెర్సీలో హిట్‌మ్యాన్ కనిపించనున్నాడు. ముంబై ఇండియన్స్ తమ పోస్ట్‌లో ‘నైట్’ (రాత్రి) పదాన్ని ఉపయోగించి 2026 వేలం కంటే ముందే రోహిత్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయమని ప్రకటించింది. వారు పోస్ట్‌లో ఇలా రాశారు. ‘రేపు సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అనేది ఖాయం. కానీ నైట్ (Knight)… కష్టం కాదు, అసాధ్యం!’ అని పేర్కొంది.
అభిషేక్ నాయర్ KKR హెడ్ కోచ్‌గా నియామకం
రోహిత్ శర్మకు సన్నిహితుడైన అభిషేక్ నాయర్ చాలా సంవత్సరాలుగా KKRతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను కోల్‌కతాకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు నాయర్‌ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమించారు. KKR ఈ అధికారిక పోస్ట్ వచ్చిన వెంటనే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా రోహిత్ శర్మ MI కోసమే ఆడతాడని ధృవీకరించింది. దీని ద్వారా రోహిత్ KKRలో చేరే పుకార్లు మళ్లీ ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్ వాటికి ముగింపు పలికింది.
