ఐపీఎల్ 15వ సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లీగ్ స్టేజ్ ఫస్ట్ హాఫ్ లో వైడ్ వివాదాలు తలెత్తితే ఇప్పుడు క్యాచ్ ఔట్ లు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. అది కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కోల్ కత్తా, ముంబై మ్యాచ్ లో తీవ్ర దుమారం రేపింది. సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో ముంబై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ తొలి ఓవర్ 6వ బంతికి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జ్‌కు సమీపం నుంచి బాల్ వెళ్లి అతని థైప్యాడ్‌కు తగిలి గాలిలో లేచింది. షెల్డన్ జాక్సన్.. కళ్లుచేదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. కానీ అంపైర్ దానిని ఔట్ ఇవ్వలేదు. జాక్సన్ విజ్ఞప్తి మేరకు కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్.. రివ్యూ తీసుకున్నాడు. అప్పుడే వివాదం రాజుకుంది.
థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్‌ను పరిశీలించారు. రోహిత్ బ్యాట్‌కు బాల్ సమీపంలో ఉన్నప్పుడు స్నికోమీటర్లో స్పైక్స్ కనిపించాయి. అయితే.. దానికన్నా ముందు.. అసలు బంతి బ్యాట్‌కు దగ్గర్లో కూడా లేకముందే స్నికోమీటర్లో స్పైక్స్ దర్శనమిచ్చాయి. ఈ విషయం టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే రోహిత్‌ను థర్డ్ అంపైర్ బ్రూస్ అక్స్‌ఫర్డ్ ఔట్‌గా ప్రకటించడం, అసంతృప్తితో హిట్‌మ్యాన్ పెవీలియన్‌కు చేరడం నిమిషాల్లో జరిగిపోయింది. ఐపీఎల్లో అంపైరింగ్, అంపైర్ నిర్ణయాలపై ఇప్పటికే అసంతృప్తి నెలకొన్న తరుణంలో.. రోహిత్ ఔట్‌పై మరోమారు దుమారం రేగింది. అంపైరింగ్‌పై రోహిత్ ఫ్యాన్స్.. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మంచి అంపైర్లను తీసుకురావాలని బీసీసీఐ, ఐపీఎల్‌ను కోరుతున్నాను. ఇలాంటి చెత్త అంపైరింగ్‌తో ప్లేయర్లు నష్టపోతున్నారు. ఏదో ఒకరోజు ఐపీఎల్ ఫైనల్లో ఇలాంటిదే జరిగితే.. రసవత్తర పోరులో లాస్ట్ బాల్కి ఇలా జరిగితే అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎవరైనా ఆ అంపైర్లకు కళ్లజోడును విరాళంగా ఇవ్వండి రా బాబు అని ఇంకో ముంబై ఫ్యాన్ అన్నాడు. కళ్లు తెరిచి అంపైరింగ్ చేయండి అంటూ మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు. ఈ వివాదాస్పద ఔట్ పై ముంబై యాజమాన్యం బీసీసీఐకి పిర్యాదు చేయాలని కొందరు ఫాన్స్ సూచిస్తున్నారు.