IPL 2023: ముంబై ఇండియన్స్‌ నుంచి కీలక ప్లేయర్‌ ఔట్..!

IPL-2023కి ముందు ముంబై ఇండియన్స్‌ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 07:30 PM IST

IPL-2023కి ముందు ముంబై ఇండియన్స్‌ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. తాము రిలీజ్‌ చేసిన ప్లేయర్ల జాబితాను ముంబై ఫ్రాంఛైజీ బీసీసీఐకి సమర్పించింది. 2010 నుంచి ముంబై తరపున ఆడుతున్న పొలార్డ్‌.. అలాగే అలెన్‌, మిల్స్‌, మయాంక్‌ మార్కండే, హృతిక్‌ షాకిన్‌ను రిలీజ్‌ చేసినట్లు సమాచారం. రోహిత్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, బుమ్రా, ఆర్చర్‌, టిమ్‌ డేవిడ్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌, సామ్స్‌, తిలక్‌ వర్మను రిటైన్‌ చేసుకుంది.

ముంబై ఇండియన్స్ (MI) IPL 2022 సీజన్‌ లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ రాబోయే IPL 2023 వేలానికి ముందు వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ సేవలను వదులుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. MI ఇప్పటికే విడుదల చేసిన, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించింది. ముంబై మొత్తం 10 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసింది.
కీరన్ పొలార్డ్ 2010 నుండి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ లో ఒక ఇన్నింగ్స్ లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోయాడు.

IPL రాబోయే ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రూయిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మలను రిటైన్ చేసుకుంది. IPL 2023 మినీవేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ వేలంలో IPL 16వ ఎడిషన్ వివరాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఐపిఎల్ లో ఇప్పటివరకు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది.

మరోవైపు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ 9 మంది ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసి న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను విడుద‌ల చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ లను CSK రిటైన్ చేసుకుంది. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీషన్, మిచెల్ సాంట్నర్ ను రిలీజ్ చేసింది.