Site icon HashtagU Telugu

MLC 2023: ఫైనల్‌కు ముంబై ఇండియన్స్… అదరగొట్టిన జూనియర్ ABD

MLC 2023

New Web Story Copy (78)

MLC 2023: ప్రపంచ వ్యాప్తంగా ముంబై ఇండియన్‌స్ కి అభిమానులు ఉన్నారు. ఎంతో మంది ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం సంపాదించడం కోసం ప్రయత్నిస్తుంటారు. అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌, నరాలు తెగే ఉత్కంఠకు వేదికైన ఈ జట్టు ఐపీఎల్ లోనే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అమెరికాలోనూ సత్తా చాటుతుంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో మొదటి నుంచి పై చేయి సాధిస్తున్న ఏంఐ జట్టు ఫైనల్ కు చేరుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ భరిత విజయం సాధించిన ఎంఐ న్యూయార్క్ ఎంఎల్‌సీ ఫైనల్‌లో అడుగు పెట్టింది.

తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగిన టెక్సాస్ పై ఎంఐ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో టెక్సాస్ 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే 38 పరుగులు చేస్తే , మిలింద్ కుమార్ 34 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఎంఐ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా, టిమ్ డేవిడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 158 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన ఎంఐ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు. ఓపెనర్ షాయన్ జహంగీర్ 36 తో శుభారంభం అందించాడు. కెప్టెన్ నికోలసన్ పూరన్ 24, యువ సంచలనం, జూనియర్ ఏబీ డివిలియర్స్ గా పిల్చుకునే డెవాల్డ్ బ్రెవిస్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచి టెక్సాస్ బౌలర్లని ఓ ఆటాడేసుకున్నాడు. టిమ్ డేవిడ్ 33, డేవిడ్ వీస్ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 19 ఓవర్లలో ఎంఐ న్యూయార్క్ 162 పరుగులు చేసి ఫైనల్ కు చేరింది.

Also Read: Bhatti Vikramarka: కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యామ్ లు కొట్టుకుపోయాయి : భట్టి విక్రమార్క