Site icon HashtagU Telugu

FIFA World Cup 2022 : అర్జెంటినాకు గట్టిఎదురుదెబ్బ…పసికూన చేతిలో ఓడి పరువుపోగొట్టుకున్న మెస్సీటీమ్..!!

Messi

Messi

ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2022లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే అర్జెంటినా జట్టుకు ప్రపంచ 51వ ర్యాంకర్ సౌదీ అరేబియా కోలుకోలేని షాకిచ్చింది. ఖతర్ లోని లుసాలీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియా 2-1తేడాతో అర్జెంటినాను దారుణంగా ఓడించింది. ఇది ఫుట్ బాల్ చరిత్రలోనే అర్జెంటినాపై సౌదీ అరేబియాకు దక్కిన తొలివిజయం. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు కూడా నాలుగు సార్లు పోటీపడినా…ఇందులో రెండు సార్లు అర్జెంటినా గెలిచింది. రెండు మ్యాచ్ లు డ్రా అవ్వడంతో అర్జెంటినా స్ట్రైకర్ మెస్సీ రాణించినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఇక గ్రూప్ సీలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటినా విజయం సాధిస్తే…ఇటలీ రికార్డును సమం చేయాల్సింది. 2019 నుంచి ఇప్పటి మ్యాచ్ వరకు వరుసగా 36 మ్యాచ్ లను గెలిచిన అర్జెంటీనా …లాస్ట్ కు తనకంటే చిన్నదైన సౌదీ అరేబియా చేతిలో దారుణంగా ఓడింది. మ్యాచ్ ప్రారంభమైన 9 నిమిషాల్లోనే అర్జెంటినా గోల్ కొట్టగ…దిగ్గజ ఆటగాడు మెస్సీ పెనాల్టీ కిక్ ను గోల్ గా మలిచి అర్జెంటీనా అకౌంట్లో వేశాడు. పూర్తి ఆధిక్యంలో ఉన్న అర్జెంటినా మొదటిభాగం ముగిసేసరికి 1-0తో ముందజలో ఉంది.

సెకండాఫ్ లో అర్జెంటినా దీటుగా ఎదుర్కొంది సౌదీ. దీంతో అర్జెంటీనాకు కష్టాలు మొదలయ్యాయి. ఇరు జట్లు ఆదిపత్యం చెలాయించాయి. దీంతో ఆట నువ్వానేనా అన్నట్లుగా సాగింది. లాస్ట్ నిమిషంలో 47వ సౌదీ అరేబియా ఆటగాడు అల్ షెష్రీ గోల్ కొట్టాడు దీంతో ఆ సమం అయ్యింది. సౌదీ ఆత్మవిశ్వాసంతో బాల్ పై పూర్తి ఆదిపత్యం చెలాయించారు. దీంతో అర్జెంటినాకు చుక్కలు కనిపించాయి. చివరి 57 వ నిమిషంలో సౌదీ ఆటగాడు సలీమ్ అల్ దవాసరి మరో గోల్ కొట్టాడు. దీంతో 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. అర్జెంటినా ఎంత ప్రయత్నించినా గోల్ ఇవ్వలేకపోయారు సౌదీ ఆటగాళ్లు. బంతిపై పూర్తి ఆదిక్యాన్ని సాధించి మెస్సీ టీంకు కోల్కోలేని దెబ్బకొట్టింది సౌదీ.