Site icon HashtagU Telugu

Sara Tendulkar: ఆ ఇద్దరిపై సారా టెండూల్కర్ రియాక్షన్ .. మీమ్స్

Sara Tendulkar

Sara Tendulkar

Sara Tendulkar: ఈ సీజన్ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఏ సమయంలోనైనా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. చివరి వరకు గెలుపోటమిపై క్లారిటీ లేకుండా పోతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఒకప్పుడు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన హార్దిక్ పాండ్యా అతనిపై సమరశంఖం మోగించాడు. ఇక శుభమాన్ గిల్ , అర్జున్ టెండూల్కర్‌ ఇద్దరు వేరు వేరు జట్లలో ఉంటూ ఆసక్తి పెంచారు.

సారా టెండూల్కర్ మరియు శుభ్‌మాన్ గిల్ డేటింగ్ పై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీంతో అర్జున్, గిల్ ఒకే మైదానంలో తలపడుతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ కుప్పలుతెప్పలుగా వెలిశాయి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఇద్దరి యాక్షన్స్ పై సారా టెండూల్కర్ స్పందన చూడటానికి అభిమానులు ఆసక్తిని కనబరిచారు.

అర్జున్ టెండూల్కర్ IPLలో తన మొదటి మ్యాచ్‌ని KKRతో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అర్జున్‌ని ఉత్సాహపరిచేందుకు అతని సోదరి సారా టెండూల్కర్ మైదానానికి చేరుకుంటుంది. ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన తర్వాత, సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరుడిని ప్రశంసించింది.

శుభమాన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసి పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నాడు. కామెరాన్ గ్రీన్ వేసిన ఒకే ఓవర్‌లో గిల్ వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్లు బాది 17 పరుగులు సాధించాడు. అతిషి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, గిల్ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో గిల్ 34 బంతుల్లో 56 పరుగులు చేసి 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 64 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని 13 పరుగుల సాధించాడు. ఇందులో ఒక సిక్స్ కూడా ఉంది.

Read More: GT vs MI: హోంగ్రౌండ్ లో గుజరాత్ జోరు… ఛేజింగ్ లో మళ్ళీ చేతులెత్తేసిన ముంబై