Site icon HashtagU Telugu

Ishant Sharma : ఐపీఎల్ కి ముందు ఇషాంత్ కు మెగా ఛాన్స్

Ishanth

Ishanth

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మెగావేలం (IPL Mega Auction) జరగనుంది. రిటైన్ కానీ ఆటగాళ్లు వేలంలో సత్తా చాటాలనుకుంటున్నారు. అంతకుముందు పలు టోర్నీలో తమ ప్రదర్శనలతో ఫ్రాంచైజీ ఓనర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చారు. ఇది వాళ్ళ ఐపీఎల్ స్థాయిని మరింత పెంచింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ (Syed Mushtaq Ali) టోర్నీ కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ (T20 series with South Africa) తర్వాత టీమిండియా (Team India) ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొననుంది. ఇందుకోసం జట్టు సభ్యులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతను బరోడా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడనున్నాడు. హార్దిక్ అన్నయ్య కృనాల్ పాండ్యా బరోడా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు ఇషాంత్ శర్మ (Ishant Sharma) సిద్ధమయ్యాడు. గత రెండు సీజన్లలో డిసి తరఫున ఇషాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సారి కూడా ఇషాంత్ తన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకుని ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఢిల్లీ భావిస్తోంది.

ఇషాంత్ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ అతని ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. గత 2 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా రాణించాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతూ మ్యాచ్‌లను గెలిపించాడు. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే మెగా వేలంలో ఢిల్లీ ఇషాంత్ ను కొనుగోలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఢిల్లీ కాకుంటే ఇతర జట్లు ఇషాంత్ కోసం పోటీ పడే అవకాశముంది. ఇషాంత్ 110 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 93 వికెట్లు తీశాడు. ఇకపోతే హైదరాబాద్ జట్టు‌‌‌‌‌‌కు తిలక్ వర్మ కెప్టెన్ కాగా శ్రేయాస్ అయ్యర్ ముంబై జట్టును నడిపించనున్నాడు. మరోవైపు రంజీ ట్రోఫీ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి బెంగాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. సంజు శాంసన్ కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే రీటైన్ కానీ ఆటగాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటితే ఫ్రాంచైజీలు వాళ్ళని ఫోకస్ చేసే అవకాశముంది.