WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కెప్టెన్..!

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల IPL 2023 కోసం తమ జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్ (Meg Lanning) నాయకత్వం వహిస్తుంది. లానింగ్ తన కెప్టెన్సీలో 5 సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది.

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 02:05 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల IPL 2023 కోసం తమ జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్ (Meg Lanning) నాయకత్వం వహిస్తుంది. లానింగ్ తన కెప్టెన్సీలో 5 సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మహిళల భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ జెమిమా రోడ్రిగ్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించి వరుసగా మూడో ట్రోఫీ (మొత్తంగా నాలుగో టీ20 ట్రోఫీ, 2022లో వన్డే వరల్డ్ కప్ కూడా ఆమె సారథ్యంలోనే ఆసీస్ గెలిచింది. మొత్తంగా ఐదు ఐసీసీ ట్రోఫీలు) గెలిచిన లానింగ్.. WPL తొలి సీజన్ లో ఢిల్లీని నడిపించనుంది. 30 ఏళ్ల లానింగ్ ఇప్పటివరకు 132 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఆమె 3,405 పరుగులు కూడా సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.

Also Read: Gold iPhones: ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు గోల్డ్ ఐఫోన్స్.. ఇచ్చేది ఎవరంటే..?

అంతేగాక వందకు పైగా టీ20లలో ఆస్ట్రేలియా జట్టుకు సారథిగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టుకు ఇన్ని మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉన్న ప్లేయర్ మరొకరు లేరు. ఆమె అనుభవం, ఆట ఢిల్లీకి లాభం చేకూరుస్తుందని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. లానింగ్ ఆస్ట్రేలియా తరపున 6 టెస్టులు, 103 వన్డేలు ఆడింది. ఈ సమయంలో ఆమె టెస్టుల్లో 345 పరుగులు, వన్డేల్లో 4602 పరుగులు, టీ20ల్లో 3405 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: జెమిమా రోడ్రిగ్స్ (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్, మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, శిఖా పాండే, జెస్ జోనాస్సెన్, లారా హారిస్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మీను మణి, పూనమ్ యాదవ్, ఎస్. , తాన్యా భాటియా, టిటా సాధు, జసియా అక్తర్, అపర్ణా మోండల్, తారా నోరిస్