Site icon HashtagU Telugu

Rahul Dravid Son: టీమిండియాలోకి రాహుల్ ద్రవిడ్ కొడుకు

Rahul Dravid Son

Rahul Dravid Son

Rahul Dravid Son: ఆటగాడిగా, కెప్టెన్ గా, హెడ్ కోచ్ గా దేశానికి సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ఇటీవలే పదవికి వీడ్కోలు పలికాడు. రాహుల్ నేతృత్వంలో టీమిండియా చారిత్రాత్మక టి20 ప్రపంచకప్ గెలుచుకుంది. టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టుకు హెడ్ కోచ్ గా ఘనతను అందుకుని సగర్వంగా తప్పుకొన్నాడు. రాహుల్ పదవికి వీడ్కోలు పలకడంతో గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టారు.

ద్రవిడ్ రాహుల్ క్రికెట్ ప్రపంచానికి దూరమైనప్పటికీ రాహుల్ రక్తంలో ఇంకా ఆ క్రికెట్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తన కొడుకును క్రికెటర్ గా చేయాలన్న తన కలను నిరవేర్చడంలో సక్సెస్ అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకొనేందుకు సిద్ధమయ్యాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్. గత కొంతకాలంగా తన ఆట తీరుతో ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సమిత్ ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సమిత్ ఆల్ రౌండర్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు సమీత్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు సెప్టెంబర్-అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించి మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది, దీని కోసం బీసీసీఐ శనివారం జట్లను ప్రకటించింది. అందులో సమిత్ ద్రవిడ్‌కు చోటు దక్కింది.

వన్డే, నాలుగు రోజుల మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో సమిత్‌కు చోటు దక్కింది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ జట్టుకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమాన్ కెప్టెన్ గా వహించనున్నాడు. ఈ వన్డే సిరీస్‌ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 7వ తేదీల్లో నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు జరుగుతాయి. ఈ సిరీస్‌ కోసం టీమిండియా చెన్నైకి వెళ్లనుంది. ఈ టీమ్‌కి మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్ధన్ సారధ్యం వహించనున్నాడు.

Also Read: Superman : ట్రంప్ ‘సూపర్ మ్యాన్’, ఎలాన్ మస్క్‌ ‘సైబోర్గ్‌’.. ఎన్నికల ప్రచారంలో క్రియేటివిటీ