Washington Sundar Sister: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆసీస్‌తో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టు ఆడుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పటిష్ఠ స్థితిలో కనిపించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసి ఆసీస్ ఆలౌటైంది. దానికి బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసి కుప్పకూలింది. అయితే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీతో భారత్ జట్టును ఆదుకున్నాడు. అయితే నితీశ్ సెంచరీ చేయటంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పాత్ర కూడా ఉంది. సుందర్ నితీశ్‌కు సపోర్ట్‌గా నిలిచి తాను కూడా హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించటంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ సాధించడంతో మరోసారి అతనితో పాటు సుందర్ అక్క శైలజా సుందర్ (Washington Sundar Sister) కూడా వార్తల్లో నిలిచింది. శైలజా సుందర్.. వాషింగ్టన్ సుందర్ సోదరి అని అందరికీ తెలిసిందే. ఈమె కూడా క్రికెటరే అని చాలా తక్కువ మందికి తెలుసు. చిన్నతనం నుంచే అక్కతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. ఇద్దరూ కూడా క్రికెట్‌లో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. వీరి తండ్రి కూడా రంజీల్లో ఆడారు. శైలజా సుందర్ కూడా తమిళనాడు తరపున డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించారు. వాషింగ్టన్, శైలజా తండ్రి ఎం సుందర్ కూడా క్రికెటర్ కావడం ఇక్కడ గమనార్హం. తండ్రి అడుగుజాడల్లోనే అక్క, తమ్ముడు నడుస్తున్నారు.
Also Read: Manmohan Daughters : మన్మోహన్‌సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
అంతేకాదండోయ్ శైలజా సుందర్ సౌత్ జోన్ అండర్-19 జట్టులో కూడా భాగమయ్యారు. తన ఎదుగుదలతో పాటు తన తమ్ముడు వాషింగ్టన్ సుందర్ కెరీర్‌పై కూడా ఆమె దృష్టిపెట్టింది. సుందర్‌కు కావాల్సిన మద్దతును, సాయాన్ని శైలజా సుందర్ తన తమ్ముడు వాషింగ్టన్ సుందర్‌కు అందించి ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌లో భాగమయ్యేందుకు తన వంతు పాత్ర వహించింది. ఇకపోతే ప్రస్తుతం శైలజా సుందర్ క్రికెట్ దూరంగా ఉంటుంది. మైదానంలో కాకుండా క్రికెట్ కామెంటరీలో రాణిస్తుంది. శైలజా సుందర్ క్రికెట్ కామెంటేటర్‌గానూ పలు ప్రముఖ స్పోర్ట్స్ ఛానెళ్లలో పనిచేసింది. శైలజా సుందర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటారు.